Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ కొత్తగూడెం/ 10 నవంబర్/ అక్షరం న్యూస్: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పిట్ సెక్రటరీగా పనిచేసిన మధుర దాస్ రెడ్డి నేడు ఆజాద్ అధికార్ సేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి బాధ్యతలు చేపట్టారు. జాతీయ నాయకుల ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అభయ్ దీప్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ కార్యచరణ, ప్రజల్లోకి పార్టీని విస్తరింప చేయడం, తెలంగాణలో రాష్ట్ర పార్టీ కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుర దాస్ రెడ్డి మాట్లాడుతూ.తనపై నమ్మకంతో పార్టీ బాధ్యతలను అప్పజెప్పినటువంటి జాతీయ అధ్యక్షులు మాజీ ఐపీఎస్ అమితాబ్ ఠాకూర్ గారికి మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి మధురేంద్ర సింగ్ గారికి ప్రత్యెక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆజాద్ అధికార్ సేన పార్టీ విస్తరణలో భాగంగా కృషి చేస్తానని, పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పార్టీ ఆదేశానుసారం పనిచేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జి బోడికల ప్రేమ్ దయాల్ మరియు ఎండి సద్దాం హుస్సేన్, సతీష్ కుమార్ పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily