Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల పెద్దపల్లి నవంబర్. 08 అక్షరం న్యూస్; మండల అభివృద్ధి దాత ప్రజల మనిషి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మరియు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను 22 గ్రామాల కమిటీ సభ్యులచే కేకులు కట్ చేసి భారీ ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించిన నాయకులు. ఓదెల మండల కేంద్రము 22 గ్రామాల చెందిన మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు మార్కెట్ కమిటీ సభ్యులు భారీ ఎత్తున మండల పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి మరియు సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి ఆధ్వర్యంలో ఓదెల జగదాంబ సెంటర్ నుండి డిజె పాటలతో భారీ ఎత్తున ఊరేగింపుగా చేసి లక్ష్మీప్రసన్న ఫంక్షన్ హాల్లో 22 కేకులతో 22 గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులతో కేకులు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే విజయ రమణారావు తనయుడు చింతకుంట గోపికృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా మూల ప్రేమ్ సాగర్ రెడ్డి మాట్లాడుతూ ఒకేసారి ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఓదెల మండల అభివృద్ధి దాత ప్రజల ప్రియతమ నాయకుడు చింతకుంట విజయ రమణారావు పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అదేవిధంగా 22 గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులతో ఇంత పెద్ద ఎత్తున పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో సుధీనమని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మరెన్నో పదవులు అలంకరించి ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు చేయాలని ప్రజా సంక్షేమమే తన ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడు అని అన్నారు అదేవిధంగా ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పుట్టినరోజు వేడుకల్లో స్కూల్ విద్యార్థులకు బుక్స్ పెన్నులు అదేవిధంగా వివిధ గ్రామాలలో అనేక సేవా కార్యక్రమాలు చేయాలని పలువురికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి సింగల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి ఉండేటి మధు యాదవ్ విజయేందర్ రెడ్డి నాయకులు చీకట్ల మొండయ్య కోట సత్యనారాయణ రెడ్డి గుండేటి ఐలయ్య యాదవ్ బైరి రవి గౌడ్ కంకణాల భాస్కర్ రెడ్డి పిట్టల రవికుమార్ ముదిరాజ్ యాదగిరి సమ్మయ్య ముదిరాజ్ సామశంకర్ ముప్పాల శంకర్ నోముల సాగర్ రెడ్డి అంబాల కుమరయ్య తోపాటు వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily