Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ కొత్తగూడ/ నవంబర్ 8(అక్షరం న్యూస్) కొత్త గూడ మండలం లోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి వారి జన్మదిన వేడుకలు కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నడుమ భారీ కేక ను కట్ చేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ జడ్పిటిసి పులుసం పుష్పలత శ్రీనివాస్, భానోత్ విజయ రూఫ్ సింగ్ మాజీ ఎంపీపీ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అధికార ప్రతినిధి వజ్జ సారయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం రేవంత్ రెడ్డి కంకణ బద్ధులై రాష్ట్రంలో ప్రజలందరికీ సుపరిపాలన అందించడమే లక్ష్యంగా వారు పోరాడిన తీరు దొరల గడిలను బద్దలు కొట్టిన తీరు టిఆర్ఎస్ ప్రభుత్వంను ఎదిరించిన తీరు వారి అవినీతి అక్రమాలను వెలికి తీసి వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయుటలో వారికి వారే సాటి అందుకే రాష్ట్రంలో రైతులు నిరుద్యోగులు మహిళలు బడుగు బలహీన వర్గాల నిరుపేద ప్రజలు రేవంతన్న పాదయాత్రకు బ్రహ్మరథం పట్టి పెద్ద ఎత్తున నీరాజనాలు అందించారు రాష్ట్రంలో రేవంతన్న పరిపాలనకు శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఉద్యోగ అవకాశాలు, మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆరు గ్యారెంటీలను అమలు చేసే తీరు ప్రజల హృదయాల్లో చరిత్రలో నిలిచిపోతారు రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేకంగా ఒక ప్రణాళిక ను ఏర్పాటుచేసి వారికి ఇందిరమ్మ రాజ్యాన్ని అందిస్తున్నారు మహిళకు ప్రత్యేకంగా ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ వంట గ్యాస్, ఉచిత విద్యుత్తు, మహిళలకు పెద్ద మొత్తంలో బ్యాంకులలో వడ్డీలేని రుణాలు , అతి త్వరలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు వరిధాన్యం కు 500 బోనస్ ప్రభుత్వం మద్దతు ధర తదితర అంశాలు మేనిఫెస్టో ప్రకారం విడతల వారీగా ప్రతి ఒక్కటి అమలు చేసే తీరు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు అందుకే మన రేవంతన్నకు భగవంతుని అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో మనకు సుపరిపాలన అందించి రానున్న రోజుల్లో అధికారికంగా ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని మనసా వాచా భగవంతుని కోరుకుంటున్నాం అని అన్నారు తధానంతరం ప్రైమరీ స్కూల్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పుస్తకాలు పెన్సిల్ పెన్నులు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి సుంకరబోయిన మొగలి కొత్తగూడ బ్లాక్ అద్యక్షులు లావణ్య వెంకన్న జిల్లా నాయకులు గుమ్మడి సమ్మయ్య ఆదర్శ రైతు మండల అధ్యక్షులు మల్లెల రణధీర్, హలవత్ సురేష్ఇర్ప రాజేశ్వర్ రాజం సారంగం బోయినేని ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం అధ్యక్షులు బొల్లు రమేష్ నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ బోడ ఈర్య నాయక్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు బుర్కా నరేందర్ వేలుదండి వేణు, అజ్మత్ పాషా మైనార్టీ సెల్ కట్రోజు బిక్షపతి చారి నోముల ప్రశాంత్ జిల్లా యూత్ కార్యదర్శి, ఎండి సయ్యద్ కో ఆప్షన్ కృష్ణ వెంకన్న, మలన తదితరులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రేవంత్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
.
Aksharam Telugu Daily