Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ... పెద్దపల్లి టౌన్ నవంబర్ 8 అక్షరం న్యూస్; ప్రజల మనిషిగా పేరు ఉన్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజ్జన్నను మంత్రి అయితే చూడాలని ఉందని విజ్జన్న యువసేన వ్యవస్థాపకులు అల్లం వినోద్ రెడ్డి ఆకాంక్షించారు. మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగి ఉండి, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన విజ్జన్న మంత్రి పదవికి అసలైన అర్హుడని ఆయన పేర్కొన్నారు. పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు జన్మదిన వేడుకలను విజ్జన్న యువసేన వ్యవస్థాపకులు అల్లం వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా పారిశుద్ధ కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అనంతరం అల్లం వినోద్ రెడ్డి మాట్లాడుతూ పేదల పక్షపాతిగా ఉన్న ఆయన్ను, అందరూ విజ్జన్న అని పిలుచుకునే గొప్ప నాయకుడు మన ఎమ్మెల్యే అని కొనియాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే విజ్జన్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయితే చూసి సంతోషపడాలని ఉందని ఆయన పునరుద్గాటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పు రాజు మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజ్జన్న మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవడంతో పాటు ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ మేరాజ్, హైమద్ పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily