Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /నవంబర్ -07(అక్షరం న్యూస్ ) ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెర్లు మద్ది ఎక్స్ రోడ్ వద్ద గురువారం అర్ధరాత్రి ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంబాన్ని డీకొట్టింది వివరాల్లోకి వెళితే తెర్లు మద్ది గ్రామానికి చెందిన గడ్డ మీది దేవయ్య ఇటీవల పెద్దురు వద్ద ప్రమాదానికి గురి అయ్యడు. క్షేత గాత్రుడు కి సిద్దిపేట లో చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో. అదే గ్రామనికి చెందిన రాయపు రాజు లక్ష్మణ్ రావు కు చెందిన టీ ఎస్ జీరో ఈ ఎక్స్2828 నెంబర్ గల కారు లో గడ్డమిది రాం చంద్రం, నాగుల నవీన్ ల తో కలిసి దేవయ్య ను సిద్దిపేట వెళ్లి పరమర్శించారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో క్రాస్ రోడ్ వద్ద అతివేగంతో కారు అదుపు తప్పి విద్యుత్ స్తంబాన్ని డికోట్టింది.వెంటనే స్పందించిన స్థానికులు విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. కారులో ఉన్నవారు కూడా క్షేమంగానే బయటపడ్డారు.ఎవరి కి ఎటువంటి ప్రమా దం జరకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఘటనపై సెస్ ఏఈ విష్ణు తేజ ను సంప్రదించగా .. కారు డ్రైవర్ నుంచి అపరాధ రుసుం వసూలు చేస్తామని, స్తంభాన్ని సరిచేసి విద్యుత్ సరఫరా పునరుద్దరిస్తామని స్పష్టం చేశారు.ప్రమాదానికి గురైన కారు నుజ్జునుజ్జుగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని జరిగిన ప్రమాదాన్ని పరిశీలించారు . ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
.
Aksharam Telugu Daily