Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెంజిల్లా/కొత్తగూడెం : పట్టణ పరిధిలోని విజయ విఘ్నేశ్వర దేవాలయంలో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొన్నారు. ఆలయంలో అన్నదానం నిర్వహించే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నిర్విరామంగా కొనసాగిస్తున్న సభ్యులకు ఆలయ కమిటీతోపాటు భక్తులు అభినందిస్తూ దీవించారు. కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని, అన్ని రంగాల్లో దినదినాభివృద్ధి చెందాలని వినాయకుడి కృప వారిపై నిండుగా ఉండాలని, సమాజంలో మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ విఘ్నేశ్వర భక్త బృందం తాటిపల్లి శంకర్ బాబు, కొదుమురి శ్రీనివాస్, అయిత ప్రకాశ్, అనూప్ ఖండేల్ వాల్, కేతేపల్లి అరుణ్ కిషోర్, నుకల ప్రవీణ్, సంకా శ్రీనివాస్, ఉప్పల శ్రీనివాస్, పసుమర్తి శ్రీనివాస్, నాగాజయరామ్, చిత్తలూరి రాము తదితరులు పాల్గొన్నారు.
-
Aksharam Telugu Daily