Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి రూరల్ నవంబర్ 6 అక్షర న్యూస్; పెద్దపల్లి మండలం, నిమ్మనపల్లి & నిట్టూరు గ్రామాలల్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణా రావు ప్రారంభించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లిస్తామని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. 17 శాతానికి మించి ధాన్యంలో తేమ లేకుండా రైతులు చూసుకోవాలని చివరి గింజవరకు కోనుగోలు చేసే బాధ్యత తనదేనన్నారు. ధాన్యంలో గింజ కూడా కటింగ్ లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 41కిలోలకు ఒక్క గ్రాము కూడా అదనంగా తూకం వేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని నిర్వాహకులను హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, సింగిల్ విండో ఛైర్మన్లు మాదిరెడ్డి నర్సింహ రెడ్డి, ఆళ్ళ సుమన్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి పృథ్వీ రాజ్, పెద్దపల్లి విండో సీఈఓ మధన్ మోహన్, మార్కెట్,సింగిల్ విండో డైరెక్టర్లు, సీసీఐ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily