Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ నవంబర్ 6(అక్షరం న్యూస్) గంగారం మండలం లోని నవంబర్ 1 నుండి 9 వరకు జరుగు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా బుధవారం రోజు న రాత్రి గంగారం మండలం కోమట్ల గూడెం లో కామ్రేడ్ గోగ్గేల లక్ష్మన్న , ఈసం జనార్ధన్, జనగం నారాయణ, పడిదల శ్రీను, కుంజా ఎర్రన్న, గంగారం మండల కేంద్రంలో అమరుడు కామ్రేడ్ పెద్ద బూర్క వెంకటన్న సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కొత్తగూడ మండలం మాజీ ఎంపీపీ, ఇర్ఫా బాబురావు, పూనెం లక్ష్మీనారాయణ,పూనం రామన్న,ల స్తూపాలపై ఎర్రజెండాలు ఎగరవేసి విప్లవ జోహార్లు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బూర్కా వెంకటయ్య సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు మాట్లాడుతూ భారవిప్లవోద్యమంలో భూమికోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం ప్రాణాలర్పించి అమరులైనారు అని అందులో భాగమే గోదావరి లోయ పరివాహక ప్రాంతంలో కామ్రేడ్ చంద్రపుల్లా రెడ్డి నాయకత్వాన నిర్మించిన గోదావరిలోయ ప్రతిఘటన పోరాటం అనేకమంది విప్లవవీర కిశోరాలు ఏజెన్సీ ఆదివాసి మారుమూల ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నిర్వహించిన ప్రజా ఉద్యమాలలో భాగస్వాములై వారి చివరి శ్వాస వరకు నిస్వార్ధంగా ప్రజల కోసం పనిచేసి అమరులు అయ్యారని వారు అన్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం విప్లవోద్యమంలో పురోగమిస్తూ అమరుల ఆశయ సాధనకై ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈక రవికుమార్ఈసం కాంతారావు, పెద్ద స్వామి సమ్మయ్య, నరేష్, తాళ్ల కొమిరెల్లి మల్లయ్య, జనగం వెంకన్న, మేడ సమ్మక్క గొగ్గెల లక్ష్మి గుండగాని జనార్ధన్ సమ్మక్క మధుకర్ శ్యాంసుందర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily