Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ కొత్త గూడ/ నవంబర్ 6(అక్షరం న్యూస్) కొత్త గూడ మండల కేంద్రము లోని గిరిజన సంక్షేమ క్రీడా పాఠశాలలోవసతులు కల్పించడం లో ఉపాధ్యాయులు విఫలమయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు తమ పిల్లలను చూసేందుకు బాదావత్ కోటేష్ భూక్య మంగీలాల్ బాదావత్ లింగయ్య గుగులోతురాజు భూక్య రాజు పాఠశాలకు వచ్చారు ఈక్రమంలో తమకు సరిగా భోజనం పెట్టడం లేదని తాగునీరు రావడం లేదని మరుగుదొడ్ల నిర్వహణ చేపట్టడం లేదని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలిపారు దీంతో ఉపాధ్యాయులను నిలదీసిన ఆందోళనకు దిగారు విద్యార్థులకు కనీసం కడుపునిండా భోజనం పెట్టడం లేదని ఆరోపించారు ఇంత జరుగుతున్న ప్రధానోపాధ్యాయుడు వార్డెన్లు మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా తమ పనులు తాము చేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ స్పందించి ఉపాధ్యాయుల పై చర్యలు తీసుకోవాలని కోరారు
.
Aksharam Telugu Daily