Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/బూర్గంపహాడ్ : ప్రజల సమస్యలు కొరకు నిత్యం పనిచేస్తాను... భజన సతీష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ బూర్గంపాడు/ నవంబర్-6/ అక్షరం న్యూస్ / టిపిసిసి తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్, హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ చైర్మన్ సీనియర్ న్యాయవాది పొన్నం అశోక్ గౌడ్ చేతుల మీదుగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,టీపీసీసీ లీగల్ సెల్, హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ నియమాక పత్రం అందుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గం పహాడ్ మండల కేంద్రానికి చెందిన న్యాయవాది భజన సతీష్ కుమార్. ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ లీగల్ సెల్, హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ, రాష్ట్ర చైర్మన్ సీనియర్ న్యాయవాది పొన్నం అశోక్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంక్షేమానికి వారికి అవసరం అయిన లీగల్ సెల్ సేవలు అందించేందుకు సిద్దంగా ఉండాలని పోలీస్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాలలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రజలకు న్యాయ సలహాలు అందించాలని, కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలను కాపాడాలని బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలని, సోనియా గాంధీ, అఖిల భారతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలను కాపాడాలని గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి మీరు చేసిన సేవలు ఎన్ ఎస్ యు ఐ విద్యార్ధి విభాగం, యూత్ కాంగ్రెస్ విభాగం నాయకుడిగా పనిచేసిన భజన సతీష్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీపీసీసీ లీగల్ సెల్, హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ, కన్వీనర్ గా ప్రజల కోసం పనిచేస్తారనే నమ్మకం ఉందని నియామక ఉత్తర్వులు ఇచ్చిన్నారు. అట్టి నియామక పత్రాన్ని పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా, న్యాయవాది భజన సతీష్ కుమార్ మాట్లాడుతూ, తన మీద నమ్మకంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీపీసీసీ లీగల్ సెల్, హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ కన్వీనర్ గా నియమించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర లీగల్ సెల్, హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ చైర్మన్ సీనియర్ న్యాయవాది అయిన పొన్నం అశోక్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డ్యూప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల. నాగేశ్వరావు, ఎంపీ బలరాం నాయక్,రఘురాం రెడ్డి,భద్రాద్రి జిల్లా ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్షుడు. శ్రీ పొదెం. వీరయ్య కు ప్రత్యేక ధన్యవాదాలు,కృతజ్ఞతలు తెలియజేశారు.
.
Aksharam Telugu Daily