Admin
అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / హైదరాబాద్ : హైదరాబాద్ అక్షరం బ్యూరో 05 తెలంగాణలో కుల గణనపై కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీ చేశారు కులగణన ద్వారా అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని రాహుల్ అన్నారు. కులాల వారీగా జనాభా లెక్కిస్తే తరాలుగా నష్టపోతున్న వారికి తగిన ప్రాతినిధ్యం దొరుకుతుందని* ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో కులగణనకు సంబంధించి పౌరహక్కులు, మేధావులతో నిర్వహించిన సభలో రాహుల్ పాల్గొన్నారు.* ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, మేధావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. *భారతదేశంలో కులవ్యవస్థ చాల బలంగా ఉందని* అన్నారు. *అగ్రకులాలకు ఎప్పుడూ కుల వ్యవస్థ అనేది కనిపించదని* చెప్పారు. కులగణన ద్వారా ఏళ్లుగా నష్టపోతున్న వారికి న్యాయం జరుగుతుందని అన్నారు. *కుల వ్యవస్థ అన్ని రంగాల్లో ఉందని.. రాజకీయ, న్యాయ వ్యవస్థలోనూ అది బలంగా పాతుకుపోయిందని* చెప్పుకొచ్చారు. కుల వ్యవస్థ అనేది కొంత మంది ఆత్మ విశ్వాసం దెబ్బతీస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల యువత సైతం ముందుకు వెళ్లలేని పరిస్థితులుఏర్పడుతున్నాయని రాహుల్ గాంధీ చెప్పారు. *ప్రపంచంలో ఎక్కడా లేని ఈ కులవ్యవస్థ ఇండియాలోనే ఉందని* రాహుల్ మండిపడ్డారు. *కుల వివక్షత వల్ల ఎంత ఇబ్బంది ఉంటుందో అర్థం చేసుకోగలనని* చెప్పారు. దేశం ఆర్థికంగా ఎదగాలంటే దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు, ప్రొఫెసర్లు కులగణనపై మాట్లాడి సూచనలు చేశారు. ప్రొఫెసర్లు చెప్పిన విషయాలను రాహుల్ గాంధీ స్వయంగా నోట్ చేసుకున్నారు.
.
Aksharam Telugu Daily