Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల/ గంభీరావుపేట : హనుమకొండ/భీమదేవరపల్లి/నవంబర్ 05(అక్షరం న్యూస్): పేకాట స్థావరం పై దాడి చేసి నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మండలంలోని హవల్దార్ పల్లి శివారులో మంగళవారం చోటుచేసుకుంది. ముల్కనూర్ ఎస్సై సాయిబాబు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ముత్తారం గ్రామంలో విలేజ్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా హవల్దార్ పల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతూ నలుగురు పట్టుబడ్డారు. ఈ మేరకు నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.9,400 నగదు,3 సెల్ ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ముత్తారం గ్రామానికి చెందిన ఎల్ది మోహన్, నద్దునూరి కరుణాకర్, వడ్డేపల్లి శ్రీనివాస్, ఎర్రబెల్లి గ్రామానికి చెందిన అతి కన్నయ్య ఉన్నారు.
.
Aksharam Telugu Daily