Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మెదక్ జిల్లా : మెదక్, బ్యూరో, హత్నూర, నవంబర్, 05( అక్షరం న్యూస్ ) సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని దౌల్తాబాద్ రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఆటో యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆటో జేఏసీ పిలుపుమేరకు హైదరాబాద్ లో మహా ధర్నాకు మద్దతుగా మండలంలోని ఆటో కార్మికులు అందరూ కలిసి దౌల్తాబాద్ రాజీవ్ గాంధీ చౌరస్తాలో ధర్నా నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు నడుపుతూ ఆటో కార్మికులకు పొట్టను కొట్టాడు సమాజం కాదని అందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆటో కార్మికుల కుటుంబాలు నడపాలంటే నెలకు 12 వేల రూపాయలు ఇచ్చి ఆటో కార్మికులకు ఆదుకోవాలని ఆటో కార్మికులకు హామీలను వెంటనే నెరవేరాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు మోటర్ ట్రాన్స్పోర్ట్ జిల్లా ఉపాధ్యక్షులు కోనంపేట శేఖర్ ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి మారుతి రాజ్ వెంకటేష్ పోచయ్య సుల్తాన్ మైనుద్దీన్ రాజు సూర్య నాయక్ ఫ్రెండ్స్ ఆటో యూనియన్ లక్ష్మారెడ్డి బద్రి షరీఫ్ నర్సింలు వీరేశం శ్రీనివాస్ సూర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily