Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : వాంకిడి కొమరం భీమ్ నవంబర్ 05 అక్షరం న్యూస్ కొమరం భీం జిల్లా వాంకిడి మండల గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ లో 60 మంది అస్వస్థత కు గురైతే ఇద్దరు బాలికలను నిమ్స్ కు తీసుకొచ్చారు. ఎనిమిదో తరగతి బాలిక మహాలక్ష్మి ,తొమ్మిదో తరగతి బాలిక జ్యోతి ల లను మెరుగైన చికిత్స కోసం నిమ్స్ తరలించారని తెలిసి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చా మహాలక్ష్మి కోలుకున్నా జ్యోతి ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరచడానికి డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. 9వ తరగతి చదువుతున్న శైలజ అనే అమ్మాయి వెంటిలేటర్ పై చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. దైర్యంగా ఉండాలని పిల్లల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పా పరిస్థితులు అన్నీ మెరుగ్గా ఉంటాయి ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య రెసిడెన్షియల్ స్కూళ్ల లో దొరుకుతుందని ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. .అయితే గత పదకొండు నెలల కాంగ్రెస్ పాలనలో తల్లి తండ్రుల నమ్మకాన్ని పోగొట్టే విధంగా ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ల లో పరిస్థితులు దిగజారాయి. రెసిడెన్షియల్ స్కూళ్ల లో మౌలిక సదుపాయాల కల్పన లో ప్రభుత్వం ఘోరంగా విఫల మయ్యిందని వరసగా జరుగుతున్న ఘటన లు చెబుతున్నాయి. ఇప్పటిదాకా నాకు తెలిసిన సమాచారం ప్రకారం ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో 36 మంది విద్యార్ధులు వివిధ కారణాలతో చనిపోయారు. 36 మంది విద్యార్థుల మరణాలు ఆంటే చిన్న విషయం కాదు ..ఏవరేజ్ గా నెలకు ముగ్గురు ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యార్థులు మరణిస్తున్నారంటే ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలి. దాదాపు 600 మంది విద్యార్థులు ఈ ఏడు నెలల్లో ఫుడ్ ఫాయిజనింగ్ బారిన పడ్డారు ,పాములు ,ఎలుకల కాట్ల ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. పిల్లలకు కరెంట్ షాక్ లు కూడా కామన్ అయిపోయాయి ఇటీవలనే మెదక్ హవేలీ ఘన్ పూర్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ లో పిల్లలకు కరెంట్ షాక్ తగిలి హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది ఎన్ని సార్లు ప్రభుత్వ దృష్టికి తెచ్చినా దున్న పోతు మీద వాన పడ్డట్టే ఉంది సీఎం ,మంత్రులు మహారాష్ట్ర ,ఝార్ఖండ్ ఎన్నికల బిజీ లో ఉన్నారు ..రెసిడెన్షియల్ స్కూళ్ల పై పట్టించుకునే తీరిక వారికి ఎక్కడ ఉంది ? ప్రతి రోజూ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు ఉన్న దుస్థితుల గురించి మీడియా కథనాలు కూడా వస్తున్నాయ్ ..వాటిపై నిప్పు మీద నీళ్లు జల్లినట్టు అప్పటిపపుడు చర్యలు తీసుకోవడం కాదు ..శాశ్వత చర్యలు చేపట్టాలి. 36 మంది రెసిడెన్షియల్ విద్యార్థుల మరణాలు ప్రభుత్వం చేసిన హత్యలే అని అనడం లో ఎలాంటి తప్పు లేదు ఈ మరణాల పై ప్రభుత్వం లో ఏ స్థాయి లోనూ సమీక్షలు జరగడం లేదు. కేసీఆర్ హాయం లో 1023 ప్రభుత్వ గురుకులాలు ఏర్పాటు అయ్యాయి. మా ఎమ్మెల్యే కోవా లక్ష్మీ గారు విద్యార్థులలోని హాస్పిటల్ కి వెళ్లి దాని ఖర్చులకు డబ్బులు ఇచ్చి పంపిస్తే హాస్పిటల్ కి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ప్రతి విద్యార్ధి పై సంవత్సారానికి లక్షా 20 వేల రూపాయలు కేసీఆర్ వెచ్చించారు. కేసీఆర్ హయం లో రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివిన విద్యార్థులు అత్యున్నత సంస్థల్లో అడ్మిషన్లు పొందారు ..డాక్టర్లు ఇంజినీర్లు పైలట్ లు ,ఐఏఎస్ ,ఐపీఎస్ లు అయ్యారు ..ఎవరెస్టు తో పాటు ప్రపంచం లో ఉన్న పేరు ప్రఖ్యాతులు ఉన్న పర్వత శిఖరాలను అధిరోహించారు. కేసీఆర్ రెసిడెన్షియల్ స్కూళ్ల ను ఎవరెస్టు స్థాయికి పెంచితే ..రేవంత్ రెడ్డి రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎలుకలు విద్యార్థులను కరిచే స్థాయికి తీసుకు పోయారు. రెసిడెన్షియల్ స్కూళ్ల కు కూడా రేవంత్ రెడ్డి రాజకీయ రంగు పులిమారు. ఏ రంగు పులిమినా ఫర్వా లేదు ..చలికాలం వచ్చింది రెసిడెన్షియల్ స్కూళ్ల లో విద్యార్థులకు రగ్గులు కూడా లేవట వాటి సంగతి చూడు రేవంత్ రెడ్డి. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంఖు స్థాపనలు చేశారు ..వాటిని కట్టేదాకా ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లను గాలికి వదిలేయడం మీ విధానమా. ప్రభుత్వం ప్రతి విద్యార్ధి పై పెట్టే పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్ పై పెట్టే పెట్టుబడిగా ఈ ప్రభుత్వం భావించాలి. గురుకులాలను నడపడం గురుతర భాద్యతగా భావించాలే తప్ప గుడ్డెద్దు చేలో పడ్డట్టు వ్యవహరించొద్దు. గురుకులాలను సమీక్షించేందుకు గతం లో సెంట్రల్ కమాండ్ సిస్టం ఉండేది.ఇపుడు అలాంటి కమాండ్ సిస్టం లేదు ప్రతి రెసిడెన్షియల్ స్కూల్ కు ఓ హెల్త్ సూపర్ వైజర్ ఉండాలి విద్యార్థులు జబ్బు పడితే కనీస మందులు అందుబాటు లో లేవు విద్యార్థులు పాములు ,ఎలుకల బారిన పడుతున్నారు ..వాటిని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. విద్యార్థులు పడుకునేందుకు కనీసం మంచాలు లేవు ..కింద పడుకోవడం వల్ల పాము కాట్ల బారిన పడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి కి రెసిడెన్షియల్ స్కూళ్ల పై సదభిప్రాయం లేదని ఇటీవల చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ల ను మూసివేసే కుట్ర జరుగుతోందనే అనుమానం వస్తోంది. రాజకీయాల జోలికి పోకుండా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి భేషజాలకు పోకుండా రెసిడెన్షియల్ స్కూళ్ల కున్న పేరును పాడు చేయొద్దు.
.
Aksharam Telugu Daily