Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ నవంబరు 5 అక్షరం న్యూస్; పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం ద్వారా తమ ఐక్యత చాటి చెప్పినట్లు, ఇదే స్ఫూర్తితో రాష్ట్రమంతా కాపులు కలిసికట్టుగా ఉండాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కన్వీనర్ చింతపండు మహేందర్ పటేల్, కాపు యువత రాష్ట్ర అద్యక్షులు బండి సంజీవ్ పటేల్ అన్నారు. పెద్దపల్లి మండలం రాగినేడులో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆత్మీయ సమ్మేళనంతో రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపులు ఐక్యతతో కలిసి మెలిసి ఉన్నారని సందేశం ఇచ్చామని అభిప్రాయపడ్డారు. మున్నూరు కాపుల హక్కులు సాధించుకోవడానికి ఏకతాటిపైకి రావాలని పిలుపు నిచ్చారు. ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేసిన ప్రతి ఒక్క కుల బాంధవులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మున్నూరు కాపు రాష్ట్ర కార్యదర్శి ఇమ్మడి శెట్టి మోహన్ పటేల్, రాష్ట్ర సోషల్ మీడియా ఎర్రం సంజీవ్ పటేల్, జిల్లా అధ్యక్షుడు అనుమాల మహేష్ పటేల్, తొగరి సురేష్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily