Reporter
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ నవంబర్ 4 (అక్షరం న్యూస్) మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి గంగారం కొత్తగూడ మండలంలోని ఆదర్శ రైతు కమిటీ కొత్తగూడ మండలం అధ్యక్షుడిగా గుమ్మడి సమ్మయ్య ఎన్నికయ్యారు.గంగారం మండల అధ్యక్షుడు గా వజ్జ సారయ్య ను ఎంపిక చేశారు. గతంలో 49 మంది సభ్యులు ఉండగా ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగం రాగా వెళ్లిపోయారు. మరో ముగ్గురు చనిపోవడంతో 44 మందితో కమిటీ నీ ఎనుకున్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వీరికి నెలకు వెయ్యి రూపాయలు చొప్పున జీతభత్యాలు ఉండేవి బిఆర్ ఎస్ ప్రభుత్వం వీరిని అధికారం లోకి వచ్చాక ఇట్టి వ్యవస్థ ను రద్దు చేయడం తో ఆదర్శ రైతులు కోర్టును ఆశ్రయంచారు. పది సంవత్సరాల పోరాటం ఫలితంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి వీరిని మళ్ళీ విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు భవిష్యత్ లో మళ్ళీ ఈ వ్యవస్థ ను రద్దు చేయకుండా పక్కడబంధీగ జివో తీసుకురావాలని వారికీ కనీస వేతనం ఇవ్వాలని చర్చలో ప్రస్థావించినట్లు సమాచారం ఇట్టి వ్యవస్థ ను తీసుకొచ్చిన వైస్సార్ కు తీపి గుర్తుగా ఉండాలని అందుకే మళ్ళి ఈ వ్యవస్థ ను తీసుకుస్తున్నట్ల సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వం రెగ్యులర్ చేయాలనీ కోరారు
.
Aksharam Telugu Daily