Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ నవంబర్.04/ అక్షరం న్యూస్; అర్హతకు మించి వైద్యం చేస్తున్న మమత అర్ష మొలల క్లినిక్ నిర్వహకుడిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ కు అందిన ఫిర్యాదు మేరకు డిఎం.హెచ్ ఓ ఆదేశాలతో పి.ఓ డా మధువరన్ మరియు డిప్యూటీ డెమో ఫైజ్ మొహియుద్దీన్ , డాక్టర్ సుందర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని 30వ వార్డు మధురబస్తి లోని మమత అర్ష మొలల క్లినిక్ ను అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సదరు నిర్వాహకుడు ఎటువంటి అనుమతులు లేకుండా మమత క్లినిక్ నీ నిర్వహిస్తూ... అధిక మోతాదులో స్టెరాయిడ్స్ ను వాడుతూ.. పైల్స్ సమస్యతో బాధపడుతున్న వారి శస్త్ర చికిత్సకు అవసరమైన అన్ని రకాల పని ముట్లు ఉండడం గమనించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మమత క్లినిక్ ను సీజ్ చేసి, సదరు నిర్వాహకుడి పై క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈసందర్భగా వారు మాట్లాడుతూ అనుమతి లేకుండా బోర్డులు ఏర్పాటు చేసినా, అర్హతకు మించి చికిత్సలు చేసినా చట్ట విరుద్ధమని, అలాంటి వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.
.
Aksharam Telugu Daily