Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మెదక్ జిల్లా : మెదక్, బ్యూరో, హత్నూర, నవంబర్, 01( అక్షరం న్యూస్ ): సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని భారత రాష్ట్ర సమితి సంగారెడ్డి జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు శివ శంకర్ రావు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదుకు 2021 అక్టోబర్ చివరి నాటికి డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థులందరూ ఓటు నమోదుకు అర్హు లు అభ్యర్థులందరూ ఓటు నమోదు చేసుకోగలరు గతంలో ఓటు హక్కు ఉన్నవారు కూడా తిరిగి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇట్టి నమోదు ఆన్ లైన్ లో కానీ ఆఫ్ లైన్ లో గాని చేసుకోవచ్చు ఆన్ లైన్ లో నమోదు చేసుకునే అభ్యర్థులు ముందుగా డిగ్రీ మెమో ప్రొవిజినల్ సర్టిఫికెట్స్ ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి కార్డ్ జిరాక్స్ ల మీద ప్రభుత్వ గెజిటెడ్ అధికారితో అటే స్టేషన్ చేయించినచో అట్టి సర్టిఫికెట్ ద్వారా స్కాన్ చేసి నమోదు చేసుకోవచ్చు ఫిజికల్ గా వెరిఫికేషన్ కొరకు తహసిల్దార్ ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు గెజిటెడ్ అధికారి తో అటెస్టేడ్ లేకుండా స్కాన్ చేసినచో ఫిజికల్ వెరిఫికేషన్ కోసము స్థానిక తహసిల్దార్ కార్యాలయం వెళ్ళవలసి ఉండును ఫిజికల్ గా నేరుగా నమోదు చేసుకునే అభ్యర్థులు ఒరిజినల్ చూపించి అక్కడే నమోదు చేసుకోగలరు ఒకవేళ అటే స్టేషన్ కానీ దరఖాస్తులు ఏవైనా ఉంటే అవి కూడా పరిగణలోకి తీసుకొని బిఎల్ఓ లు తర్వాత వెరిఫికేషన్ వేస్తారు కావున మీరు సకాలంలో మీ ఓటు నమోదు చేసుకోవాలని భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శివ శంకర్ రావు తెలిపారు.
.
Aksharam Telugu Daily