Reporter
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /నవంబర్ -01(అక్షరం న్యూస్ ) చెడుపై.. మంచి సాధించిన విజయానికి ప్రత్యేకంగా జరుపుకునే దీపావళి వేడుకలు ముస్తాబాద్ మండల వ్యాప్తంగా అత్యంత ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెల్లవారుజాములోగా ఇళ్లలో పూజలు నిర్వహించి హారతులు తీసుకున్నారు. సాయంత్రం వ్యాపార, వర్తక, వాణిజ్య దుకాణాల్లో ధనలక్ష్మి పూజలు జరిపారు.సేమియా, పెనీలు, స్వీట్లు. అరగించారు. కొత్త అల్లులకు వస్త్రాలు, బంగారం దీపావళి కట్నం గా పెట్టారు.ఇళ్లు, దుకాణాల ముంగిళ్లలో దీపాలు వెలిగించి బాణసంచా కాల్చారు.చిన్న, పెద్ద తేడాలేకుండా సాయంత్రం టపాకాయలు కాల్చుతూ ఆనందో త్సవాలతో గడిపారు వ్యాపారులు దుకాణాల ఎదుట విద్యుత్ దీపాలు, రంగురంగుల కాగితాలతో మామిడి, అరటి ఆకు లతో అందంగా ఆలకరించారు. వ్యాపారులు కొత్త ఖాతా పుస్తకాలను తెరిచి పూజలు చేశారు. అనంతరం బాణా సంచా పేల్చి దీపావళి వేడుకలను ఆనందోత్సహల మధ్య జరుపుకున్నారు ముస్తాబాద్ మండల కేంద్రం లో దీపావళి పురస్కరించుకొని శ్రీ శివ కేశవా ఆలయ రథం లు గ్రామ పూరవిధుల గుండా తిరిగాయి భక్తులు స్వాములకు మంగళహారతి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు .కొనుగోళ్లతో సందడిగా మార్కెట్ ... దీపావళి పండుగ కొనుగోళ్లతో మార్కెట్ సందడిగా మారింది. మార్కెట్లో వివిధ రకాల ప్రమిదలు, దొంతులు, బొమ్మల కొలువు విగ్రహాల విక్రయాలు జోరుగా సాగయి ఆకట్టుకునే అలంకరణ సామాగ్రి, రంగురంగుల విద్యుద్దీపాలకు డిమాండ్ పెరిగింది. లక్ష్మీదేవి పూజలో అలంకరణకు వినియోగించే అరటి మొక్కలు, బోదెలకు గిరాకీ పెరిగింది. మార్కెట్‌లో ప్రమిదలు, లైట్లు, క్యాండిళ్ల విక్రయాలు జోరందుకున్నాయి. డజన్ ప్రమిదలు రూ.50నుంచి రూ.80 వరకు విక్రయించారు . సాధారణ ప్రమిదలు రూ.20 నుంచి రూ.50 వరకు అమ్మారు. కిలో బంతిపూలు 100నుండి 50 రూపాయల ధర పలికాయి. వీటితో పాటు బాణాసంచాల దుకాణాల వద్ద కూడా పెద్ద ఎత్తున సందడి నెలకొంది
.
Aksharam Telugu Daily