Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి జిల్లా/ కొత్తగూడెం/ అక్టోబర్.30/ అక్షరం న్యూస్: ప్రభుత్వం విధుల నుంచి డిస్మిస్ చేసిన 10 మంది ప్రత్యేక పోలీసులు, సస్పెండ్ చేసిన 37 మందిని విధుల్లోని తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. సమస్యలను వెల్లడించేందుకు వారు రోడ్డెక్కినట్లు పేర్కొన్నారు. వలసకాలపు ధోరణులను మరచి, సమస్యను పరిష్కరించాలన్నారు. అలా చేయకుండా వారిని అణచివేస్తే భవిష్యత్తులోనూ అసంతృప్తి కొనసాగే అవకాశముందన్నారు.
.
Aksharam Telugu Daily