Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /అక్టోబర్ -29(అక్షరం న్యూస్ ) ముస్తాబాద్ మండలము చిప్పలపల్లి గ్రామం లో మంగళవారం అకాల వర్షం కురిసింది. ఉదయం ఎండ ఉండటంతో రైతులు రోడ్ల వెంబడి, కల్లాల్లో ధాన్యం ఆరబెట్టారు. సాయంత్రం ఒక్కసారిగా వర్షం రావడంతో ధాన్యం తడిసింది. రైతులు తడిసిన ధాన్యాన్ని నీటి నుంచి వేరు చేశారు. కోతలు ప్రారంభం నుంచి వర్షాలు కురుస్తుండటంతో రైతన్నలు అయోమయానికి గురవుతున్నారు.గత 15రోజులు గా జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రం ప్రారంభించిన కొనుగోళ్ల్లు ప్రారంభించక పోవడంతో వరి ధాన్యం తడిసి పోయింది అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వారం రోజులు వర్షం పడకుంటే వడ్లు అమ్ము కునే వారమని రైతులు పేర్కొన్నారు. ఇంకా వర్షం ఎక్కువ పడి వడ్లు తడిస్తే ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి ధాన్యం తడిసి పోవడంతో వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మార్కెట్ కమిటీ మాజీ వైస్ చేర్మెన్ కొమ్మెట రాజ మల్లు కోరారు .
.
Aksharam Telugu Daily