Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /అక్టోబర్ -29(అక్షరం న్యూస్ ) ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్థానిక తెలంగాణ చౌక్ వద్ద నవంబర్ 08 తేదీన సాయంత్రం నిర్వహించనున్న సదర్ సయ్యాట ఉత్సవాన్ని విజయవంతం చేయాలని ముస్తాబాద్ శ్రీ కృష్ణ యాదవ యువ సేన సభ్యులు కోరారు ప్రతి సంవత్సరం యాదవులు సదర్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.యాదవుల సాంస్కృతిక ప్రతీక.. ‘సదర్’ అని తెలిపారు పాడిపంటలు చక్కగా ఉండాలని గోవులను పూజించి, దున్నపోతులను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి విన్యాసాలు నిర్వహిస్తామన్నారు. పోతురాజుల విన్యాసాలు కూ డా ఆకర్షణీయంగా ఉంటాయని అన్నారు. హైదరాబాద్‌కే పరిమితమైన సదర్ పండుగను తొలిసారిగా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలనాటి సమాజంలో వారి వృత్తే వారికి గుర్తింపు, వారి జీవన విధానంలో భాగమైన పనులే వారి పండుగలు, అవే నేటికీ వారి సాంస్కృతిక ప్రతీకలు. అటువంటివే నేటి సదర్ ఉత్సవాలు. భిన్న సంస్కృతి,సంప్రదాయాలకు నిలయం అని తెలిపారు ఈ ఉత్సవానికి యాదవులు, ఉద్యోగ, యువజన, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు
Aksharam Telugu Daily