Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/చొప్పదండి : - చొప్పదండి /కరీంనగర్ అక్టోబర్ 27(అక్షరం న్యూస్ ) చొప్పదండి పట్టణం లోని అంబేద్కర్ చౌరస్తా లో కేబుల్ వైర్ కి వ్యాన్ తగలడము తో కేబుల్ వైర్ తెగి కరెంట్ వైర్ల మీద తో మూడు గంటల పాటు అంబేద్కర్ చౌరస్తా లో విద్యుత్ కి అంతరాయము కలిగింది. అక్కడ వున్న స్థానికులు అక్షరం ప్రతినిధి తో చెప్పిన వివరాల ప్రకారం ఆరున్నర గంటల సమయం లో ప్రధాన రహదారి పై వెళ్తున్న వ్యాన్ అంబేద్కర్ చౌరస్తా కి రాగానే వ్యాన్ కేబుల్ వైర్ కి తగలడముతో విద్యుత్ వైర్ తెగి కరెంట్ వైర్ల మీద పడడం తో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. వెంటనే స్థానికులు విద్యుత్ సిబ్బంది కి సమాచారం ఇవ్వగానే, స్పందించిన విద్యుత్ సిబ్బంది వచ్చి ట్రాన్స్ ఫారం కి ఫీజు వేసినా కూడా విద్యుత్ రాకపోయే సరికి ట్రాన్స్ఫారమ్ ని చెక్ చేయగా ట్రాన్స్ఫరం కాలిపోయిందని నిర్దారణ కి వచ్చిన విద్యుత్ సిబ్బంది రాత్రి సమయం అయినప్పటికీ అప్పటికప్పుడు అదనంగా వున్న విద్యుత్ ట్రాన్స్ఫరం ని తీసుకువచ్చి ఎంతో శ్రమించి పది గంటల ముప్పై నిమిషం ల సమయం లో విద్యుత్ ని పునరుద్దరించారు. దాదాపు రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు విద్యుత్ సరఫరా కోసం ఎంత గానో శ్రమించిన విద్యుత్ సిబ్బందిని అంబేద్కర్ చౌరస్తా వద్ద స్థానికంగా వున్న ప్రజలు ఎంతో మెచ్చుకుని వారి కృషిని కొనియాడారు. చొప్పదండి పట్టణంలో మనుషులకు, వాహనం లకి తాకేట్టు ఇస్తారీతిన కేబుల్ వైర్లు వేసినారు. కొన్ని ప్రదేశాల్లో అయితే తక్కువ ఎత్తులోనే ఈయొక్క కేబుల్ వైర్లు ప్రమాదకరం గా వున్నాయి. ఇంకా కొన్ని ప్రదేశాలలో అయితే కేబుల్ వైర్లు విద్యుత్ స్తంబానికి కట్టి విద్యుత్ స్తంభం దగ్గరనే ఈయొక్క కేబుల్ వైర్ల చుట్టని అక్కడే వైర్లు ఊగులాడి కింద పడి వుంటున్నాయి.గతం లో కూడా కేబుల్ వైర్ల వలన పలు ప్రమాదం లు జరిగి పలువురు గాయపడి, విద్యుత్ వైర్లు తాకటం తో ఒకరిద్దరు చనిపోయిన సంఘటనలు కూడా వున్నాయి. ఇప్పటికయినా విద్యుత్ అధికారులు, మునిసిపల్ యంత్రాంగం ఈయొక్క కేబుల్ వైర్లు ఇస్థారీతిన్ విద్యుత్ స్తంబాలకి కడుతున్న కేబుల్ సంస్థలకి నోటీసులు ఇచ్చి విద్యుత్ ప్రమాదం లు జరగకుండా చూసి ప్రజలు ప్రమాదం లకు గురి కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily