Reporter
అక్షరం తెలుగు డైలీ - బిగ్ బ్రేకింగ్ / హన్మకొండ/భీమదేవరపల్లి : హనుమకొండ/భీమదేవరపల్లి/అక్టోబర్ 27(అక్షరం న్యూస్): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గడిపె అస్మిక (4) అనే చిన్నారి నీటిసంపులో పడి మృతి చెందింది. సంపత్, స్వర్ణలకు ముగ్గురు పిల్లలు కాగా అస్మిక చిన్న కూతురు. తల్లిదండ్రులు కూలీ పని చేసుకుంటూ జీవిస్తుంటారు. ఆదివారం ఉదయం తల్లిదండ్రులు పనికి వెళ్లగా ఇంటివద్ద ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడింది. స్థానికులు గమనించి 108 కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ వచ్చేలోపే చిన్నారి చనిపోయింది.
.
Aksharam Telugu Daily