Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మెదక్ జిల్లా : మెదక్, బ్యూరో, హత్నూర, అక్టోబర్, 24( అక్షరం న్యూస్): సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని దౌల్తాబాద్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ ను పరిశీలించి మాట్లాడుతూ ఈ ఏడాది పదవ తరగతి ఉత్తమ ఫలితాలు సాధన కోసం ఇప్పటి నుండి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యార్థులను ప్రతిభా ఆధారంగా గ్రూపులుగా విభజించి వారి సామర్థ్యాల పెంపొందించడం కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని పాఠశాలలో ఉన్న సమస్యలను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు ఏదైనా విద్యార్థులకు సమస్యల ఉంటే నా దృష్టికి తీసుకురావాలని వెంటనే పరిష్కారం కోసం కృషి కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానోపాధ్యాయులు .ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily