Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /అక్టోబర్ -21(అక్షరం న్యూస్ ) పోలీసు అమరవీరుల త్యాగం అజరామరం.అని ముస్తాబాద్ ఎస్ ఐ గణేష్ అన్నారు.సోమవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ సిబ్బంది తో కలసి పోలీస్ అమర వీరులకు నివాళులు అర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి పోలీసు దేశానికి వెన్నెముకలాంటి వాడన్నారు. అనంతరం గౌరవ వందనం చేశారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులలో అసువులు బాసి న పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily