అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : ఇండోనేషియాలోని ఈస్ట్ జావాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకున్నది. ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 129 మంది మరణించారు. మరో 180 మంది గాయపడ్డారు. ఇండోనేషియన్ ఫుట్‌బాల్ లీగ్‌లో భాగంగా శనివారం రాత్రి ఈస్ట్ జావాలోని మలాన్ రెగెన్సీలో ఉన్న స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులైన పెర్సెబాయ సురబాయ, అరెమా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో అరెమా జట్టు ఓడిపోయింది. దీంతో సొంత స్టేడియంలో ప్రత్యర్థి చేతిలో తమ జట్టు ఓడిపోవడంతో ఆగ్రహించిన అభిమానులు.. మైదానంలో రచ్చరచ్చ చేశారు. దీంతో పెర్సెబాయ జట్టు అభిమానులపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరుజట్ల అభిమానుల మధ్య తీవ్రఘర్షణ చోటుచేసుకున్నది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు. వారిని అదుపుచేసేందుకు టియర్‌గ్యాస్ ప్రయోగించారు. ఈక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 34 మంది అక్కడికక్కడే మృతిచెందారని అధికారులు తెలిపారు. సుమారు 300 మందిని దవాఖానకు తరలించామని చెప్పారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు, చిన్నారులు కూడా ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటనపై ఇండోనేషియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ దర్యాప్తునకు ఆదేశించింది.
.
Aksharam Telugu Daily