Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : శంకరపట్నం/కరీంనగర్/అక్టోబర్ 16/ అక్షరం న్యూస్.. శంకరపట్నం మండలం మెట్పల్లి జడ్పీహెచ్ఎస్ లో బుధవారం విద్యార్థులకు మాదకద్రవ్యాల పై అవగాహన కల్పించిన ఎస్సై రవి.మాట్లాడుతూ రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా యువత పనిచేయాలని కోరారు. నేటి తరంలో విద్యార్థులు సరదాలు,సెల్ఫోన్లకు,మందుకు డ్రగ్స్ కు అలవాటై తమ విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని అన్నారు. విద్యార్థిని దశలో చెడు స్నేహాలతో సిగరెట్టు, మందుకు అలవాటు పడి మత్తుపదార్థాలపై బానిసలవుతున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు చదువులో వెనుకబడడం,పరీక్షలు సరిగా రాయకపోవడం,ఒంటరిగా ఉండడం,ప్రవర్తనలో మార్పు లను గమనిస్తూ ఉండాలన్నారు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నేర్పిన విద్యాబుద్ధులతో, క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు,ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily