Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /అక్టోబర్ -07(అక్షరం న్యూస్ ) దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ముస్తాబాద్ మండలం కేంద్రం తో పాటు అవునూర్, బంధన్ కల్ పోతుగల్ ,చీకోడ్, నామపూర్, తెర్లుమద్ది గ్రామాలలో సోమవారం ఐదో రోజు శ్రీ మహా చండి దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా అమ్మవారి సన్నిధానంలో దేవి నిత్య పూజ, కుంకుమార్చన, మహా చండీయాగం, విశేష పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ మహా చండీ యాగ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జంటలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గామాత కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత కమిటీ సభ్యులు, మాలధారణ స్వాములు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily