Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : మహబూబాబాద్ /గార్ల /అక్టోబర్ 6/అక్షరం న్యూస్... నూతన ఆర్ధిక విధానాల అమలుతో అసంఘటిత రంగం నిర్వీర్యమై, వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిపోయిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ అన్నారు.కార్మికులకు అండగా నిలిచి వారి హక్కులకై జరిగిన పోరాటం లో ఎర్రజెండా చాంపియన్ గా పోరాటం చేస్తుందని అన్నారు. మహబూబాబాద్ జిల్లా, గార్ల మండల కేంద్రంలోని స్దానిక వర్తక సంఘం భవనంలో నిర్వహించిన సిపిఎం నాలుగు హమాలీ శాఖల మహాసభలో పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ,హమాలీ కార్మికులకు ఎగుమతి, దిగుమతులకు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ధరల పెరుగుదల కు పోరాటాలు చేయాలన్నారు.మహాసభ ముందుగా సిపియం జెండాను సినియర్ నాయకులు అంబటి వీరాస్వామి ఆవిష్కరించారు.ఈ మహసభలో సిపిఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్,జిల్లా నాయకులు కందునూరి కవితా, భూక్య హరి నాయక్ మండల నాయకులు వి.వెంకటేశ్వర్లు,కె.ఈశ్వర్ లింగం,యం.నాగమణి,నాయకులు అలవాల రామకృష్ణ, ఎస్.నాగరాజు, జి.వీరభద్రం, వి.ఇస్తారి,సర్వయ్య,ప్రవీణ్, సర్వర్, మల్లయ్య,కె మహేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily