Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అతివేగం ఇతరుల ప్రాణానికి హాని కలిగిస్తుందని కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా రోడ్లపై వాహనాలు నడుపుతూ ఇతర ప్రయాణదారు లకు ప్రాణ సంకటాన్ని కల్పిస్తున్నారని ఇకనుంచి కొత్తగూడెంలో ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించి అతివేగంగా వాహనాలు నడిపే వారిపై ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశామని అతిగా మద్యం సేవించి విచ్చలవిడిగా వాహనదారులు వాహనాలు నడిపే వారిపై చర్యలు తప్పవని శుక్రవారం కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ కే నరేష్ హెచ్చరించారు. కొత్తగూడెంలో పలు ప్రాంతాల్లో రద్దీ ఉన్న ప్రదేశాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. జిల్లా ఎస్పీ, డిఎస్పి ఆదేశాల మేరకు నంబర్ ప్లేట్ లేని వాహనాలను, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని, పట్టుకొని పూర్తిస్థాయిలో వాహన పత్రాలను పరిశీలించి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన నలుగురు వాహనదారుల లైసెన్సులు రద్దు చేసినట్లు తెలిపారు. కొత్తగూడెంలో ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని కేవలం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ పోలీసులు చేపడుతున్న ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ కు వాహనదారులు ప్రజలు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని కోరారు. ఇప్పటికే కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో వాహనదారులకు ప్రభుత్వ ఉద్యోగులకు యువతకు ట్రాఫిక్ అనుసరించు విధానాలపై అనేక అవగాహన సదస్సులు ఏర్పటు చేశామని అయినప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా పోలీసులు నిబంధనలను అతిక్రమిస్తూ రోడ్డు ప్రమాదాలలో వారి అమూల్యమైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని అన్నారు. ప్రధానంగా నంబర్ ప్లేట్ లేని వాహనాలపై దృష్టి సారించామని ఈ విషయంలో ప్రభుత్వ శాఖల ఉద్యోగులైన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలపై ప్రయాణించే వారికి అనేక నష్టాలు వాటిల్లుతున్నాయని ఈ విషయంలో ప్రయాణకులు తప్పకుండా పోలీస్ సూచనలు పాటించాలని సూచించారు. పాఠశాలలు విడిచే సమయంలో చిన్నారులు రోడ్డు దాటుతూ ఉంటారని ఆ సమయంలో యువత విచ్చలవిడిగా అతివేగంగా వాహనాలు నడుపుతూ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఇలాంటి వారిపై ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా అమలు చేసి లైసెన్సులు రద్దు చేసేందుకు వెనకాడబోమని హెచ్చరించారు.
-
Aksharam Telugu Daily