Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : శంకరపట్నం/కరీంనగర్/ సెప్టెంబర్ 2( అక్షరం న్యూస్ ) మండలంలోని కన్నాపూర్ గ్రామంలో బుధవారం రోజున తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఉద్యమకారుల ఫోరం ఆవిర్భావ దినోత్సవం మరియు గాంధీ జయంతిని పురస్కరించుకొని జిల్లా ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ నాయకులు,సామాజిక సేవ స్వభావం గల మాజీ వైస్ ఎంపీపీ మోతే ఎల్లారెడ్డికి మరియు ఇటీవల ఆయన సతీమణి మోతే భాగ్యలక్ష్మి ఎంపీటీసీ పదవీకాలం ఇటీవల ముగిసిన సందర్భంగా వారి ఇరువురు దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగినది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కష్టపడిన మండలంలోని ఉద్యమకారుల ఫోరం నాయకులను కూడా శాలువాతో ఘనంగా సన్మానించి రాష్ట్ర కమిటీ ద్వారా విడుదలైన ప్రశంస పత్రాలను అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కోఆర్డినేటర్ ఐల ప్రసన్న, మండల అధ్యక్షులు దేవునూరి అంకుష్, సీనియర్ ఉద్యమకారులు అంతం కృష్ణారెడ్డి, చిమిరాల శేషచారి, చెరుకు వెంకటేశం, గోపు మల్లేశం,వోడ్నాలా శ్రీనివాస్, రాస మల్ల శ్రీనివాస్, అల్వాల గోపి,నిమ్మశెట్టి వీరస్వామి, పచ్చిమట్ల సుధాకర్, రంగు శ్రీనివాస్, కల్లూరి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily