Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ : మహబూబాబాద్ /బయ్యారం /అక్టోబర్ 1/అక్షరం న్యూస్... యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ ఎంతో భక్తిశ్రద్ధలతో మొదటి రోజు నుండి ఆఖరి రోజు వరకు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే బతుకమ్మ,నేటితో ప్రారంభం కావడంతో రాష్ట్రమంతా వివిధ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.మహబూబాబాద్ జిల్లా,బయ్యారం మండల పరిధిలోని గంధంపల్లి అక్షర స్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబురాలు జరిగాయి. కరస్పాండెంట్ బోడ రమేష్ ఆధ్వర్యంలో పాఠశాల మొత్తాన్ని పూలవనంగా మార్చి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి చిన్నారులతో బతుకమ్మ సంబరాలు జరిపించారు. ఈ సందర్భంగా బోడ రమేష్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ అనేది మన ఇంటి పండుగ మన పండుగను మనం జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు.ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ అని అన్నారు.నాటి నిజాం పోలీసులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసిన వీర మహిళలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని నిలబెట్టడంలో బతుకమ్మ కీలకపాత్ర పోషించిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం మరియు చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily