Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : * శంకరపట్నం/ కరీంనగర్/అక్టోబర్ 1( అక్షరం న్యూస్) శంకరపట్నం మండలంలోని,కేశవపట్నం గ్రామంలో గల శ్రీ సాయి విద్యా మందిర్ ఉన్నత పాఠశలలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా బతుకమ్మ ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు.పిల్లలు వారి తల్లిదండ్రుల చేత బతుకమ్మలను అందంగా అలంకరించుకొని పాఠశాలలో బతుకమ్మ ఆటను ఆడారు.ఆశ్వయుజ మాసంలో దేవినవరాత్రుల వైభవం గురించి మరియు తొమ్మిది రోజుల బతుకమ్మ పేర్లు ఆ రోజు చేసే నైవేద్యాలను గురించి మరియు దసరా పండుగ యొక్క విశిష్టతను గురించి విద్యార్థిని , విద్యార్థులకు వివరించడం జరిగింది.విద్యాలయంలో ముందస్తు బతుకమ్మ సంబరాలను నిర్వహించారు.ఈ ఈ కార్యక్రమంలోఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు,విద్యార్థిని, విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily