Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : . శంకరపట్నం/కరీంనగర్/అక్టోబర్ 1( అక్షరం న్యూస్) డిజిటల్ క్రాప్ సర్వే కొరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహాయకులను అందించకుండా కేవలం ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులతో మాత్రమే చేయాలని చెప్పడంతో శంకరపట్నం మండల కేంద్రంలో వ్యవసాయ అధికారులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. ఒక క్లస్టర్ లో వ్యవసాయ విస్తరణ అధికారికి రెండు నుండి మూడు గ్రామాలు,6000-10000 ఎకరాల డిజిటల్ క్రాఫ్ట్ సర్వే చేయాలి అంటే అదనంగా ఒక్కో వ్యవసాయ విస్తరణ అధికారికి ఇద్దరు లేదా ముగ్గురు సహాయకులు ఉండాలని లేనిపక్షంలో సర్వే చేయడానికి సమయం ఎక్కువగా పడుతుందని పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలోని జమ్మికుంట మండలంలో డిసిఎస్ ను నిర్వహించారు జమ్మికుంట మండలంలో పూర్తిగా వ్యవసాయ విస్తరణ అధికారులు పురుషులు ఉండడంతో వారు సర్వేను ప్రారంభించారు.కానీ సర్వే ప్రారంభమైన తర్వాత వారి వల్ల కాకపోవడంతో ఇతరుల ఇతర మండలాలలోని ఏఈఓ లను డిప్యూటేషన్ పై జమ్మికుంట మండలానికి బదిలీ చేసి సర్వేను పూర్తి చేశారు.దాదాపుగా 20 మంది ఏఈవోలు,డిసిఎస్ సర్వేను చేయడానికి రెండు నెలలు సమయం తీసుకున్నారు. ఈ డిసిఎస్ సర్వే కొరకు వ్యవసాయ విస్తరణ అధికారులపై వ్యవసాయ అధికారులపై ఒత్తిడి తీసుకు వస్తున్నందుకు నిరసనగా రాష్ట్ర వ్యవసాయ విస్తరణ అధికారుల ఐకాస పిలుపుమేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ఏవో వెంకటేష్ వ్యవసాయ విస్తరణ అధికారులు సునంద,లక్ష్మీ ప్రసన్న ,స్రవంతి, తిరుపతి పాల్గొని నిరసన తెలిపారు.
.
Aksharam Telugu Daily