Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : శంకరపట్నం/కరీంనగర్/అక్టోబర్ 1(అక్షరం న్యూస్) శంకరపట్నం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం రోజున సెక్టార్ మీటింగు ఆశా డే నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పి హెచ్ సి డాక్టర్ గొట్టే శ్రావణ్ మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన అంశాలలో జరిగిన అభివృద్ధి గురించి అదే విధంగా ఏ విధమైన లోటుపాట్లు ఉన్నాయో వాటిని త్వరగా పూర్తిచేయాలని ఆశ వర్కర్లకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను పెంచే విధంగా గర్భిణీ స్త్రీలకు సూచనలు సలహాలు ఇవ్వాలని వారికి ఎటువంటి సమస్య ఉన్న త్వరగా స్పందించి ఆ సమస్యలను తీర్చే విధంగా ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ కార్డు యొక్క ఉపయోగాలను ప్రజలకు సూచించి వాటి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో పూర్తిగా వివరించాలని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి గురువారం ఆరోగ్య మహిళా క్యాంపు నిర్వహించడం జరుగుతుందని మండలంలోని మహిళలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. శంకరపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నలుగురు మహిళా డాక్టర్లు ఉన్నారని 13 సంవత్సరాల పైబడిన మహిళలకు సంబంధించిన జనరల్ ఎగ్జామినేషన్ బ్రెస్ట్ క్యాన్సర్,ఓరల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించి మహిళలకు సంబంధించిన రక్త పరీక్షలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భాస్కర్, సూపర్వైజర్లు ఎం ఎల్ హెచ్ పి డాక్టర్ సురేష్,శ్వేత,మనో చిత్ర,శ్రావణి,సన వివిధ గ్రామాల ఆశా వర్కర్లు,ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily