Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : ** శంకరపట్నం/కరీంనగర్/అక్టోబర్ 1(అక్షరం న్యూస్) శంకరపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో తెలంగాణ సాంస్కృతిక వారసత్వ పండగ *బతుకమ్మను* *మా బడి బతుకమ్మ* పేరున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల సాంస్కృతిక విభాగం ఉపాధ్యాయులు,డాక్టర్ మహేందర్,వనజ,జ్యోతి ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ లోని ప్రతి విద్యార్థిని వారి తరగతి గదిలలో భక్తిశ్రద్ధలతో బతుకమ్మను పేర్చి టీచర్ల సహాయ,సహకారాలతో అత్యంత ఆకర్షనీయంగా అలంకరించి మా బడి బతుకమ్మ ప్రాంగణంలోకి తరగతుల వారీగా ఒక చోటికి చేర్చిన తరువాత పాఠశాల ప్రిన్సిపల్ వి.సరిత పసుపు కుంకుమతో గౌరమ్మను బతుకమ్మను పూజించి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. మావిడాకు తోరణాలతో అందంగా అలంకరించి పండగ వాతావరణం గా ఏర్పాటు చేసిన ప్రాంగణంలో విద్యార్థులు తరగతుల వారిగా వలయాకారంగా వుండి సాంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. విద్యార్థులతో కలిసి మహిళా ఉపాధ్యాయురాలు నృత్యం చేయడం విద్యార్థులలో ఆనంద ఉత్సాహాన్ని కలిగించాయి . .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రభాకర్,రాజు,మధుకర్,రమణారెడ్డి,సతీష్ కుమార్,శివ శంకర్, కనక లక్ష్మి, సంధ్య,రాధా,నాగమణి,ఫర్హీన్, ఎస్.రజిత,ఆర్.రజిత, అనిత,స్వప్న,రజిని,నిర్మల, తిరుపతి,మోహన్,సురేందర్, నాన్ టీచింగ్ స్టాఫ్ సమ్మయ్య, ఓదేలు,పోచమ్మ తో పాటు పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని ఘనంగా విజయవంతం చేశారు.
.
Aksharam Telugu Daily