Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : * ** శంకరపట్నం/కరీంనగర్/అక్టోబర్ 1(అక్షరం న్యూస్ ) కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్య అవసర సరుకుల ధరలను లను వెంటనే తగ్గించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బి ప్రసాద్ డిమాండ్ చేశారు.మంగళవారం రోజున కొత్తగట్టు గ్రామంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడంలో జాప్యం చేస్తుందన్నారు.నిత్యావసర సరుకుల పైన 12 నుంచి 13 శాతం పన్నులు విధించడంతో పేద,మధ్యతరగతి ప్రజానీకం పండుగ సమయంలో తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఆర్భాటంగా ప్రకటించిన రైతు భరోసా ఇంతవరకు ఇవ్వకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడంలో ఆధార్ కార్డు,బ్యాంక్ అకౌంటు,రేషన్ కార్డు మ్యాచింగ్ కావట్లేదని ఇబ్బందులకు గురిచేస్తూ ఇంతవరకు రుణమాఫీ చేయలేదన్నారు.ఎన్నికల్లో కౌలు రైతులకు 15000 వేలు వ్యవసాయ కూలీలకు 12000 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించిందన్నారు.ఇప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదన్నారు.రేషన్ కార్డులు అక్టోబర్ నెలలో అమలు చేస్తామని ఇంతవరకు విధి విధానాలు ప్రకటించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,కనీసం దరఖాస్తు ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియడం లేదన్నారు. అదేవిధంగా రేషన్ కార్డుల అప్లికేషన్ చేసుకునేందుకు నిరంతరం ఆన్లైన్లో అప్లై,డిలీట్ చేసుకునేవిదంగా సాఫ్ట్ వేర్ ను రూపొందించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే రైతులను,కౌలు రైతులను, వ్యవసాయ కూలీలను కలుపుకొని పేద ప్రజల పక్షాన సిపిఎం సమరశీల పోరాటాలకు సిద్ధమవుతుందని పేర్కొన్నారు. జరిగే పరిణామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని అన్నారు.ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి ,సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెల్మారెడ్డి రాజిరెడ్డి,సుంకరి సంపత్,సీపీఎం నాయకులు రాయి కంటి శ్రీనివాస్,పిట్టల తిరుపతి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సారంగపాణి తది తరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily