Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : మహబూబాబాద్ /గార్ల /అక్టోబర్1/అక్షరం న్యూస్... మారుతున్న కాలానికి అనుగుణంగా సీనియర్ సిటిజన్స్ (వయో వృద్ధులు) వీలుంటే తమ జీవనశైలిని మార్చుకోవాలని స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో అన్నారు.మహబూబాబాద్ జిల్లా,కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా సీనియర్ సిటిజన్స్ (వయోవృద్ధులు) తమ జీవన శైలిని మార్చుకోవాలన్నారు.స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్, తదితర ఆన్లైన్ సేవలు వినియోగించుకుంటే తమ పని తాము చేసుకున్నట్లు ఉంటుందని వీలున్న వయోవృద్ధులు సేవలను వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ సీనియర్ సిటిజన్స్ లను గౌరవించాలని, వారి ద్వారానే మనందరం ప్రస్తుతం ఉన్నామని తెలిపారు. సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 1 వరకు ఈ వారోత్సవాలు నిర్వహించడం జరిగిందని, వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన సీనియర్ సిటిజన్స్ గుర్తించి వారిని సన్మానించామ్మన్నారు. వారి గౌరవార్థం ప్రత్యేక ప్రతిజ్ఞ చేశారు. వయోవృద్ధులకు ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే వారి సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ 14567 కు కాల్ చెయ్యాలని అదనపు కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వెల్ఫేర్ అధికారిని వరలక్ష్మి, జడ్పీ సీఈవో నర్మద, అడిషనల్ డిఆర్డిఓ శాంతి కుమారి, సిడిపిఓలు శిరీష, కమల, విజయలక్ష్మి, ఎల్లమ్మ, లక్ష్మి, సంబధిత శాఖల సిబ్బంది చంద్ర శేఖర్, సాగంగం, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily