Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : .. మహబూబాబాద్ /గార్ల /అక్టోబర్1/అక్షరం న్యూస్... ఫొటోలో జీవం ఉట్టిపడాలంటే ఫోటోగ్రాఫర్ ఎంతో అంకితభావం, సృజనాత్మకతతో పనిచేయాల్సి ఉంటుంది. విధినిర్వహణలో ఫోటోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే ప్రయత్నం చేయాలనీ ఫోటోగ్రఫీలు డిమాండ్ చేస్తున్నారు.గార్ల మండల ఫోటో, విడియోగ్రఫీ అసోసియేషన్ నూతనకమిటిని మహబూబాబాద్ జిల్లా, గార్ల మండల కేంద్రంలోని స్థానిక మంగపతి భవనంలో ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలలో అధ్యక్షునిగా బల్లెం దుర్గా ప్రసాద్, కార్యదర్శిగా శ్రీరామ్, కోశాధికారిగా రావూరి ప్రశాంత్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికకు సహకరించిన యూనియన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.అనంతరం గార్ల మండల సీనియర్ ఫోటోగ్రాఫర్ భాను స్టూడియో ప్రోప్రేటర్ జంజీరాళ్ల భాస్కర్ భార్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిన ఫోటోగ్రాఫర్లు భాస్కర్ కు ధైర్యం చెప్పి ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో అక్కినపల్లి సతీష్, భాసిపంగు ప్రశాంత్, శ్రీనివాస్ రెడ్డి, విజయ్, నాగబాబు, వీరు, రాజు, రమేష్, ఏజస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily