Admin
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / హైదరాబాద్ : అక్షరం ప్రతినిధి హైదరాబాద్ 01 అక్టోబర్ అక్టోబర్ కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైనుపై ఇప్పటికే సర్వే పూర్తయిన విషయం తెలిసిందే. ఇకనుంచి ఈ పనులు శరవేగంతో జరగనున్నాయి. వీటికోసం కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి రూ.137 కోట్లు విడుదల చేసింది. 2025 మార్చినాటికి ప్రాజెక్టు పూర్తవుతుంది. ఈ క్రమంలోనే కొత్తపల్లి నుంచి వేములవాడ మధ్య ట్రాక్ నిర్మించాల్సి ఉంది. దీనికోసం అధికారులు భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు దూరాన్ని తగ్గించాలని కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు మధ్య ప్రస్తుతం ఉన్న దూరాన్ని తగ్గించే లక్ష్యంతోనే ఈ కొత్త లైను నిర్మాణం జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే సిరిసిల్ల, సిద్దిపేటలకు రైలు సౌకర్యాన్ని కల్పిస్తారు. ప్రస్తుతానికి సింగిల్ ట్రాక్ బ్రాడ్ గ్రేజ్ రైల్వే లైను నిర్మాణం జరుగుతోంది. ఈ ఏడాది ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.350 కోట్లు కేటాయించింది. ఇప్పటికే కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొమురవెల్లి మల్లన్నన ఆలయాన్ని దర్శించుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతోంది. సిద్దిపేట నుంచి నాచారం వరకు ట్రయల్ రన్ పూర్తయింది. కొత్తపల్లి-మనోహరాబాద్ మధ్య కొత్తగా 16 రైల్వేస్టేషన్లు ఉంటాయి ఇండియన్ రైల్వే రైలుకూ తప్పని రోడ్డు ట్రాఫిక్ కష్టాలు.. ఇన్‌స్టాలో వైరల్‌గా మారిన పోస్ట్.. రైల్వేశాఖ వివరణ" మల్కన్ గిరి నుంచి పాండురంగాపురం వరకు కొత్తపల్లి-మనోహరాబాద్ కాకుండా తెలంగాణ, ఏపీ, ఒడిసా, చత్తీస్ గఢ్ లోని గిరిజన ప్రాంతాలను కలుపుతూ సరికొత్త రైల్వేలైను నిర్మించబోతున్నారు. ఒడిసాలోని మల్కన్ గిరి నుంచి తెలంగాణలోని పాండురంగాపురం వరకు ఈ రైల్వలైను నిర్మిస్తారు. రూ.4వేల కోట్లతో 200 కిలోమీటర్ల రైల్వే లైను నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఏపీ, తెలంగాణ నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు ఈ లైను వల్ల అనుసంధానత పెరుగుతుంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు, ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు ఈ ప్రాజెక్టువల్ల అతి పెద్ద మేలు కలగనుంది
.
Aksharam Telugu Daily