Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /సెప్టెంబర్ -30(అక్షరం న్యూస్ ) స్కూల్‌లో బతుకమ్మ వేడుకలంటే పట్టు పరికిణి వేసుకుని ఎంతో ఆనందంగా వచ్చిన మూడేళ్ల చిన్నారిని.. పాఠశాలకు తీసుకొచ్చిన వ్యాన్ చిదిమేసింది కాసేపయితే.. బతుకమ్మ ఆడుకునే అదే గ్రౌండ్‌లో.. పట్టు లంగాతో చేతిలో టిఫిన్ బాక్స్, బ్యాగ్‌తో .. ఆ చిన్నారి విగతజీవిగా పడి ఉండటం.. అందరి గుండెల్ని పిండేసింది. రెండు రోజులైతే.. స్కూల్‌కు దసరా సెలవులు. ఈరోజు స్కూల్‌లో బతుకమ్మ పండుగ సెలెబ్రేషన్స్. పిల్లలంతా కొత్త డ్రెస్సులు వేసుకుని ఎంతో సంతోషంగా స్కూల్‌కి వచ్చారు. అందరిలాగే.. ఆ చిన్నారి కూడా పట్టు పరికిణీ వేసుకుని.. ఎంతో సంబురంగా స్కూల్‌కి వచ్చింది. "ఈరోజు స్కూల్‌లో బతుకమ్మ సెలెబ్రెషన్స్ మమ్మీ.. మంచి డ్రెస్సు వేసుకుని రమ్మంది మా మిస్." అని చెప్తే ఆ తల్లి ఎంతో మురిసిపోతూ.. పండుగ కోసమని కుట్టించిన పట్టు పరికిణి వేసి.. బుట్టబొమ్మలా తయారు చేసింది. "స్కూల్‌లో అందిరితో కలిసి మంచిగా బతుకమ్మ ఆడుకో.. వచ్చిన తర్వాత స్కూల్‌లో ఏంఏం చేశారో మొత్తం చెప్పాలి.." అంటూ ప్రేమగా ముచ్చట్లు చెప్తూ.. తనకు ఇష్టమైన టిఫిన్ చేసి.. బాక్స్ పెట్టి పంపించింది బడికి వెళ్లేందుకు బ్యాగ్ వేసుకొని అమ్మ భాయ్ అంటూ బస్సు ఎక్కి బయలుదేరింది. అంతలోనే ఆ చిన్నారిని బస్సు రూపంలో మృత్యువు కబలించడంతో కానరాని లోకానికి వెళ్లిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన భూమా రాజు వెంకటలక్ష్మి దంపతులకు గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలు లేకపోవడంతో మనోజ్ఞ(5) అనే చిన్నారిని పెంచుకుంటున్నారు. తండ్రి భూమరాజు ఉపాధి కోసం సౌదీ వెళ్లగా, తల్లి కుమార్తెను చూసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ముస్తాబాద్ లోని మహర్షి స్కూల్‌కు వెళ్లిన మనోజ్ఞ స్కూల్లో బస్సు దిగింది. బస్సు వెనుక నుండి వెళుతున్న క్రమంలో డ్రైవర్ చూడకుండా రివర్స్ తీయడం తో వెనుక టైర్ల కింద పడి అక్కడిఅ క్కడే మృతిచెందింది. కుమార్తె మరణవార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు పాఠశాలకు చేరుకొని చిన్నారి మృతదేహంపై పడి బోరున విలపించారు. అలానే పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. స్కూల్ ఆవరణలో పోలీసులతో వాగ్వాదం చేసుకున్నారు. తమ కూతురు ను ఈ ఏడాదే పాఠశాలలో చేర్పించామని, ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగిందని తల్లి, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు విషయం తెలుసుకున్న విద్యార్ధి సంఘాలు అయినా ఎస్ ఎఫ్ ఐ, ఏబీవీపీ, డీ వై ఎఫ్ ఐ, ఎన్ ఎస్ యు ఐ లు పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు, విద్యార్థిని కుటుంబం కు న్యాయం చేయాలని, పాఠశాల గుర్తింపు రద్దు చేసి యాజమాన్యం పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా విద్యా అధికారి పూర్తి వివరాలు సేకరించి నివేదిక తయారుచేసి పై అధికారులకు అందచేసారు వారు ఇచ్చే ఆదేశాల ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు పాప మృతి తో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఘటన స్థలానికి . ఏ ఎస్పి శేషద్రి రెడ్డి,అడిషనల్ ఎస్పీ చంద్రయ్య,డీ ఎస్పీ లు చంద్ర శేఖర్ రెడ్డి సర్వర్ ,సి ఐ మొగిలి. ఆర్ డీ ఓ, ఎల్ రమేష్, డీ ఈ ఓ రమేష్ కుమార్, అసిస్టెంట్ మోటార్ వెకిల్ ఇన్స్పెక్టర్ రజిని దేవి ఎస్ ఐ గణేష్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించారు. ఘటన పూర్వాపరాలు పరిశీలించి వ్యాన్ డ్రైవర్‌తో పాటు స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ గణేష్ వివరించారు. అనంతరం ఆంబులెన్స్ లో పోస్ట్ మార్టం నిమిత్తం సిరిసిల్ల ఆసుపత్రికి పాప మృతదేహాన్ని తరలించారు
.
Aksharam Telugu Daily