Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : మహబూబాబాద్ /గార్ల /సెప్టెంబర్ 30/అక్షరం న్యూస్... దేశంలో సంపద సృష్టించడం ఒకేత్తయితే దాన్ని సామాన్య ప్రజలకు చేర్చకుంటే ప్రయోజనం ఏమిటని సిపిఎం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ ప్రశ్నించారు.బిజెపి మతోన్మాద విధానాలపై పోరాటాలు చేయడమే సిపిఎం ధ్యేయం అని అన్నారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలను ప్రతిఘటిస్తూ ఉద్యమాలు చేయడమే సిపిఎం లక్ష్యమన్నారు.మహబూబాబాద్ జిల్లా, గార్ల మండల పరిధిలోని సీతంపేట గ్రామంలో గడ్డిపాటి రాజారావు అధ్యక్షతన నిర్వహించిన సిపిఎం శాఖ మహాసభలో సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆర్ధిక దుష్ఫలితాలపై నిత్యం సిపిఎం నాయకులు గళాన్ని వినిపించాలన్నారు. మోడీ పాలనలో రాజ్యాంగం, ఫెడరలిజం, ప్రజాస్వామ్యం, లౌకిక విధానాలు ప్రమాదంలో పడ్డాయని అన్నారు. కేంద్రంలోని బీజేపీ విధానాలతో దేశానికి వస్తున్న పెను ప్రమాదాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.ఈ మహాసభలో సిపిఎం గార్ల మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్, జిల్లా నాయకులు భూక్యహరి,మండల నాయకులు వి.పి వెంకటేశ్వర్లు, అలవాల సత్యవతి, కై.బాబు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily