Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం /తల్లాడ సెప్టెంబర్ 29 (అక్షరంన్యూస్) చిన్నారి రేష్మి జనరల్ నాలెడ్జ్ సభికులను ఎంతగానో ఆకట్టుకుంది. తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రేష్మి గ్రామంలోని ఏడవ అంగన్వాడి కేంద్రానికి వెళ్తుంది. శనివారం తల్లాడలో నిర్వహించిన పోషణ అభియాన్ మాసోత్సవాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ చిన్నారి పాడిన వందేమాతర గేయం, జనరల్ నాలెడ్జి ఎంతగానో ఆకట్టుకుంది. ఐదేళ్లలోపు చిన్నారి అన్ని జనరల్ నాలెడ్జ్ చదువుతూ శభాష్ అనిపించుకుంది. టీచర్ కోపెల మీనాకుమారి అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబిస్తూ అబ్బురపరిచింది. దీంతో వేదికపై ఉన్న ఎమ్మెల్యేతో పాటు సభి కులు ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు. అంగన్వాడీల్లో చదువుకు, పనితీరుకు నిదర్శనంగా సెంటర్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు సిడిపిఓ, సూపర్వైజర్, పలువురు అధికారులు ఆ సెంటర్ టీచర్ మీనాకుమారిని, ఆయాను ప్రత్యేకంగా అభినందించారు.
.
Aksharam Telugu Daily