Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : * శంకరపట్నం/కరీంనగర్/సెప్టెంబర్ 26(అక్షరం న్యూస్) మహిళల సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం,రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య మహిళ క్లినిక్స్ ని ప్రారంభించిందని శంకరపట్నం మండల వైద్యాధికారి డాక్టర్ శ్రావణ్ తెలిపారు.శ్రావణ్ మాట్లాడుతూ ఆరోగ్య మహిళా కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందన్నారు.ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి తగ్గు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో దీర్ఘకాలిక సమస్యలు బారిన పడుతుంటారు.ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులకు చెప్పుకోకపోవడం ఇష్టం లేక కొందరు,వ్యాధి లక్షణాల పై అవగాహన లేక మరికొందరు ఇబ్బంది పడుతుంటారన్నారు.ఎక్కువ మంది బీపీ,షుగర్,థైరాయిడ్ వంటి సమస్యలతో రావడంతో అక్కడికక్కడే ఉచితంగా మందులు అందజేశారు.వ్యాధి నిర్ధారణ కోసం ఇద్దరి శాంపుళ్లను జిల్లా ఆస్పత్రుల్లోని టీ డయాగ్నోస్టిక్ కేంద్రాలకు పంపారు.రెండు మూడ్రోజుల్లో ఫలితాలు వచ్చాక వారికి అవసరమైన వైద్య సేవలు అందించనున్నారు.మండల పరిధిలోని పలువురు మహిళలు ఈ కార్యక్రమంలో ఎమ్.ఎల్.హెచ్.పి.డాక్టర్లు సన,మనోచిత్ర,శ్రావణి,శ్వేత లు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily