Reporter
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : మహబూబాబాద్/గార్ల/సెప్టెంబర్ 26/అక్షరం న్యూస్... సత్యనారాయణపురం గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ పునః ప్రారంభానికి కృషి చేసిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, గార్ల సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ లకు సిపిఎం గార్ల మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.ఇదే స్ఫూర్తితో పాకాల ఏటిపై హై లెవెల్ వంతెన నిర్మించాలని కోరారు. గత పాలకుల హామీలు పాకాల ఏటి నీటి మూటలుగా మిగిలాయని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లోనైనా పాకాల ఏటిపై హై లెవెల్ వంతెన నిర్మించి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. గార్ల సిహెచ్ సి లో పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో నిరుపేద ప్రజలకు సకాలంలో వైద్యం అందడంలేదని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్యులు లేకపోవడంతో దిక్కులేక స్తోమత లేకపోయినా ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా తక్షణ చర్యల్లో భాగంగా గార్ల సిహెచ్ సి లో వైద్యులు, సిబ్బందిని నియమించాలని, ఇందుకు ఎమ్మెల్యే కోరం కనకయ్య జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చించి పై సమస్యలు పరిష్కరించాలని కోరారు.
.
Aksharam Telugu Daily