Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/వైరా సెప్టెంబర్ 26 (అక్షరంన్యూస్) ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ 14 వార్డు శాంతినగర్ ఎస్టీ కాలనీ రైతు వేదిక సమీపంలోని ఎలాంటి అనుమతులు లేకుండా ఎన్ఎస్పీ కాలువపై నిర్మాణం చేపట్టిన ఇంటిని మున్సిపల్ అధికారులు సిబ్బంది ప్రోక్లైన్ తో కూల్చివేశారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ ఎస్టి కాలనీ పక్కన ఎన్ఎస్పి కెనాల్ స్థలాలను కొంతమంది ఆక్రమించి బిల్డింగ్ నిర్మాణాలను చేపట్టారు ఇటీవల కాలంలో ప్రభుత్వా అనుమతులు లేకుండా బిల్డింగ్ నిర్మాణం చేపట్టడంతో మున్సిపల్ కమిషనర్ వేణు టౌన్ ప్లానింగ్ అధికారి భాస్కర్ నిర్మాణ పనులను పరిశీలించి, ప్రోక్లైన్తో బిల్డింగ్ నిర్మాణాన్ని తొలగించారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూములలో నిర్మాణాలు చేపడుతున్న భవనాలను హైడ్రా అమలు చేయడంతో అక్రమ నిర్మాణం పనులను కూల్చి వేశారు. దీంతోపాటు మరి కొంతమంది స్థానికులు ఖాళీగా ఉన్న ఎన్ఎస్పి కెనాల్ పై ఏర్పాటు చేసిన పల్లె పకృతి వనంలో ఇల్లు నిర్మాణం చేపట్టేందుకు కర్రలు జెండాలు నిలిపి పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణు టౌన్ ప్లానింగ్ అధికారి భాస్కర్ రెవెన్యూ అధికారులు పోలీసులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily