Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్ధిపేట/బెజ్జంకి : బెజ్జంకి/సిద్దిపేట,సెప్టెంబర్26(అక్షరం న్యూస్) :-మండల పరిదిలోని తోటపల్లి గ్రామంలో గల ఇండియన్ బ్యాంక్ ఎదుట గురువారం బ్యాంక్ చుట్ట పక్కల గ్రామాల రైతులు ఋణమాఫీ కాలేదంటూ నిరసన చేపట్టారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు పరిచిన ఋణమాఫి పథకంలో భాగంగా రెండు లక్షల వరకు ఋణాలను మాఫి చేస్తామని గడిచిన ఎన్నకల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాకా రైతులను విస్మరించిందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తోటపల్లి ఇండియన్ బ్యాంక్ శాఖ పరిదిలోని సుమారుగా 800 మంది రైతులకు ఋణామాఫి జరగలేదన్నారు.
*** బ్యాంకు చుట్టూ మొహరించిన పోలీసులు *** తోటపల్లి ఇండియన్ బ్యాంక్ వధ్ధ రైతులు నిరసన వ్యక్తం చేయబోతాన్నారని ముందస్తు సమాచారంతో ఎస్.ఐ కృష్ణారెడ్డి,పోలీసు సిబ్బంది మోహరించారు.ఈ సందర్భంగా ఎస్.ఐ తో స్థానిక రైతులు తమకు ఋణమాఫి జరిగేంత వరకు నిరసనలు చేపడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Aksharam Telugu Daily