Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం లాలాపురం సమీపంలోని సర్ రైస్ మిల్లు పై సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసే సీఎంఆర్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేయకపోవటం తో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రైస్ మిల్లులో ధాన్యం లేక గోడౌన్ లు దర్శనమిచ్చాయి.. దీంతో అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో కోట్లాది రూపాయల విలువైన 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం అయినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాన్ని మోసం చేసిన రైస్ మిల్లు యజమానిపై సివిల్ సప్లై అధికారులు కేసు నమోదు చేసారు. నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఇచ్చిన దాన్యం తరుగు రావడం వల్ల నష్టం జరిగిందంటున్న నిర్వాహకులు తెలిపారు. దాడుల్లో సివిల్ సప్లై డిఎం గంటా శ్రీలత , డిఎస్ ఓ చందన కుమార్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు కమల్ పాష, ఆర్ పుల్లయ్య స్వామి, దాస్ సివిల్ సప్లై అధికారులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
-
Aksharam Telugu Daily