Reporter
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / హన్మకొండ/భీమదేవరపల్లి : హనుమకొండ/భీమదేవరపల్లి/సెప్టెంబర్ 25(అక్షరం న్యూస్): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 22 సంవత్సరాలుగా నిర్వహించబడుతున్న శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా మాడుగుల అశోక్ ఎన్నికైనట్లు గౌరవ అధ్యక్షులు మాడుగుల ఈశ్వరయ్య, ఎల్తూరి ప్రభాకర్, మాడుగుల రమేష్ తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా మాడుగుల నరేందర్, కోశాధికారులుగా బొల్లంపల్లి రాజమౌళి, బోయిని శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా గొర్రె సదానందం, వేముగంటి రాజేష్, గునుకుంట్ల మహిపాల్, దాట్ల రాజు, కార్యదర్శులుగా కండె చిరంజీవి, కొదురుపాక శ్రీనివాస్ లు ఎన్నికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను జరుపుకునేందుకు కమిటీ తరపున జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 22 సంవత్సరాలుగా దిగ్విజయంగా కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాలకు దాతలు సహకరించాలని కోరారు. ఇందులో మాడుగుల సంతోష్ కుమార్, ఎల్తూరి ప్రేమ్ రాజ్, మాడుగుల తిరుపతి, మాడుగుల అజిత్, గునుకుంట్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily